నిరుద్యోగం లేని రాష్ట్రమే జగన్ గారి ఆశయం..
నిరుద్యోగం లేని రాష్ట్రమే జగన్ గారి ఆశయం. రాష్ట్రంలో నిరుద్యోగులు అనేవారు లేకుండా చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆశయం. ఆయన ఆశయానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాలలో త్వరలో జాబ్ మేళాలు నిర్వహిస్తాం. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజులపాటు నిర్వహించనున్న జాబ్ మేళాను ఈ రోజు ప్రారంభించడం సంతోషంగా ఉంది.