తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులతో కాలేజి కేంపస్‌లో ఈరోజు పరిచయ కార్యక్రమం జరిగింది.

తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులతో కాలేజి కేంపస్‌లో ఈరోజు పరిచయ కార్యక్రమం జరిగింది.

తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులతో కాలేజి కేంపస్‌లో ఈరోజు పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేను పలు అంశాలపై ప్రసంగించాను. వాటిపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాను. పెనువేగంగా జరుగుతున్న ప్రపంచీకరణ కారణంగా విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఏ విధంగా తమ భవిష్యత్తును ప్లాన్‌ చేసుకోవాలనే అనే అంశంతోపాటు తమ ఆలోచనలు, అభిరుచులకు తగినట్లుగా కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలన్న విషయాలపై నా సూచనలు, సలహాలను వారితో పంచుకున్నాను.