విశాఖలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు…
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పండగలా చేయాలని నిర్ణయించాం.
– తెలుగు భాషా ప్రాధాన్యత తెలిసేలా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
– గత ఐదేళ్లూ బాబు ఆంధ్ర రాష్ట్ర దినోత్సవ వేడుకలు మరిచిపోయారు.
– బెంజ్ సర్కిల్ లో దీక్షలు చేసిన ప్రజలను ఇబ్బంది పెట్టడమే బాబుకు తెలుసు.
– ఇరిగేషన్ విభాగంలో చంద్రబాబు రూ.68 వేల కోట్లు దుర్వినియోగం చేశారు.
– రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారు.
– విశాఖలో భాగస్వామ్య సదస్సు లపై కామర్స్ శాఖకు లేఖరాస్తే వివరాలు లేవన్నారు.
– సీఎం శ్రీ వైయస్ జగన్ పాలనలో విశాఖకు మహర్దశ పట్టనుంది.
– విశాఖ కేంద్రంగా అపారమైన అభివృద్ధి జరగనుంది.
– టీడీపీ హయాంలో విశాఖను భూ కుంభకోణాలకు నిలయంగా మార్చారు.
– విశాఖలో భూములపై సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోంది.
– భూ కుంభకోణంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవు.
– గత ప్రభుత్వం సిట్ నివేదికను బయటపెట్టలేదు.
– సిట్ విచారణ పరిధిని పెంచే ఆలోచన ఉంది.
– అనకాపల్లి, యలమంచిలి ప్రాంతాలను సిట్ పరిధిలోకి తేవాలని కోరతాం.
– సిట్ ఫిర్యాదుల స్వీకరణ గడువు పెంచాలని కోరతాం.
– గతంలో రాజధాని విషయంపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది.
– ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక బట్టి నిర్ణయం.
– చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్…. ఇది అందరికీ తెలుసు.
– రాజకీయాల్లో సినిమా స్టిల్స్ పనికిరావు.
– ప్రజా సమస్యలు తీరుస్తారని జనం నమ్మితే పవన్ ఎందుకు ఓడిపోయారు.
– లోకేష్ దీక్ష వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
– ఐదేళ్లూ ఆహార దీక్ష…. ఐదు గంటలు నిరాహార దీక్షా?
– జర్నలిస్ట్ లు అంటే సీఎంకు గౌరవం ఉంది.
– మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే చర్యలు ఉండవు.
– కులాల వారీగా మీడియాను విభజించడం బాధాకరం.
– విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ , డివిజన్ రెండూ ఉండేలా ప్రధాని మోడీ సీఎం శ్రీ వైయస్ జగన్ కు హామీ ఇచ్చారు.
– అన్ని ప్రాంతాల అభివృద్దే సీఎం శ్రీ వైయస్ జగన్ ధ్యేయం.
– పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో పనులు జరగాలి.
– లేదంటే భూములు వెనక్కి తీసుకుంటాం.
– లులూ సంస్థ నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టే రద్దు చేశాం.
– ప్రత్యేక హోదా విషయంలో సీఎం శ్రీ వైయస్ జగన్ వైఖరి మారలేదు.
– పోలవరంపై హైకోర్టు తీర్పు సంతోషం…. పోలవరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేస్తాం.
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024