ఎస్బీఐ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు!

ఎస్బీఐ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు!

December 12, 2016 15:21 (IST)

vsr-sbi

మాజీ ఉద్యోగులు, రైతులు, వితంతువులు నుంచి వసూలు చేసే పీనల్, ఇతర వడ్డీరేట్ల విషయంలో ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ కఠినతరమైన విధానాన్ని అవలంభిస్తున్నట్టు తెలుస్తుందని దానిలో నిజనిజాలు వెల్లడించాలని రాజ్యసభలో ఆర్థిక మంత్రిత్వశాఖను వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి  ప్రశ్నించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, హర్యానాల్లో ఈ విధమైన పాలసీని అవలంభిస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. రుణాల వసూల విషయంలో ఎస్బీఐ పెట్టే ఒత్తిడిని తట్టుకోలేక పలువురు మాజీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న దాఖలు కూడా ఉన్నాయని, అసలు ప్రభుత్వానికి దీనిపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. హర్యానాలోని ఎస్బీఐ భివానీ బ్రాంచుకు సంబంధించిన కేసులు వివరాలున్నాయని, అలాంటి పాలసీలను ఎస్బీఐ ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
విజయ్సాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిచ్చారు. ఎస్బీఐతో పాటు బ్యాంకులన్నీ పెండింగ్లో ఉన్న రుణాన్ని రికవరీ చేసుకునేందుకు ఎలాంటి రుణగ్రహితలకైనా బోర్డు అంగీకారయోగ్యమైన పాలసీనే ఉంటుందని, వారు చట్టబద్ధంగానే వసూలుచేపడతారని సమాధానమిచ్చారు. ఎలాంటి చట్టబద్ధమైన ఉల్లంఘనలు లేకుండా మానవతావాదంతో, వ్యాపారాలు నిర్వహిస్తున్నామని ఎస్బీఐ చెప్పినట్టు తెలిపారు. భివాని బ్రాంచులో 917 రుణాలను పెన్షనర్లు ఇచ్చారని వాటి విలువ రూ.12.25 కోట్లగా ఉందని, వాటిలో మాజీ ఉద్యోగులవి రూ.7.10 కోట్లున్నాయని ఎస్బీఐ చెప్పింది. వీటిలో 10 లోన్ అకౌంట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని,  భివానీ బ్రాంచుకు సంబంధించి ఏ మాజీ ఉద్యోగి కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం ఎస్బీఐ నోటీసుకు వచ్చిన దాఖలా లేవన్నారు.

Recommended Posts