తెలుగు తమ్ముళ్ల రోషం, పౌరుషం ఏమైంది?

తెలుగు తమ్ముళ్ల రోషం, పౌరుషం ఏమైంది?

తెలుగు తమ్ముళ్ల రోషం, పౌరుషం ఏమైంది?

Vijayasai Reddy fires on Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ వ్యతిరేకతలో నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీని, తిరిగి అదే పార్టీతో  సీఎం చంద్రబాబు నాయుడు చేతులు కలపడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తెలుగు తమ్ముళ్ల రోషం, పౌరుషం ఏమైందని, మీ ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ ఆత్మ ఘోష వినపడలేదా అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. నాడు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు నేడు ఆయన ఆత్మక్షోభకు గురిచేస్తే తిరగబడరా అని ప్రశ్నించారు. ఏ సిద్ధాంతంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారో దానిని చంద్రబాబు కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టి కళ్లకద్దుకుంటుంటే మీ రక్తం మరిగిపోవటం లేదా? అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.