న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : విజయసాయి రెడ్డి

న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : విజయసాయి రెడ్డి

న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : విజయసాయి రెడ్డి

Ex Apprentices Association Employees Meet Central Minister Nirmala Sitharaman - Sakshi

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయసాయి రెడ్డి తదితరులు

సాక్షి, న్యూఢిల్లీ : 600 మంది ఎక్స్‌అప్రెంటిస్‌ ఉద్యోగులకు న్యాయం జరిగేలా కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. గురువారం నేవల్‌ డాక్‌ యార్డు అప్రెంటీస్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలసి విజయసాయి, నిర్మలా సీతారామన్‌ను కలిశారు. సమావేశాం అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈస్ట్రన్‌ నావల్‌ కమాండ్‌లో ఆరు వందల  మంది ఎక్స్‌ అప్రెంటిస్‌లకు న్యాయం చేయాలని రక్షణ మంత్రిని కోరినట్లు తెలిపారు.

ఇందుకు స్పందించిన మంత్రి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఎక్స్‌ అప్రెంటిస్‌లకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఎక్స్‌ అప్రెంటిస్‌ ఉద్యోగులు ధర్నాలు, దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

నావల్‌ డాక్‌ యార్డ్‌ ఎక్స్‌ అప్రెంటిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోటేశ్వరావు మాట్లాడుతూ.. నావల్‌ డాక్‌ యాజమాన్యం సర్వీస్‌ రూల్స్‌ పాటించడం లేదు. ఎక్స్‌ అప్రెంటిస్‌లను పట్టించుకునే నాధుడే లేరని వాపోయారు. డాక్‌ యార్డ్‌ ఉద్యోగులకు వైఎస్సార్‌ సీపీతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి న్యాయం చేస్తామని హామి ఇచ్చారని తెలిపారు.


Recommended Posts