ఏ క్షణమైనా ఎన్నికలు : విజయసాయి రెడ్డి
ఏ క్షణమైనా ఎన్నికలు : విజయసాయి రెడ్డి
Jun 24, 2018, 15:49 IST
సాక్షి, విజయనగరం : ఏ క్షణమైనా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రావొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి సూచించారు. ఆదివారం అరకు వైఎస్సార్ సీపీ పార్లమెంటు నియోజకవర్గ బూత్ లెవల్ కమిటీ సమావేశాలకు పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు.
విజయనగరం పేరులోనే విజయం ఉందని, జిల్లాలోని ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
ఏపీలోని 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుల కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలే విజయవంతమయ్యాయని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. బూత్ లెవల్ కన్వీనర్లు సైనికుల్లా పని చేయాలని సూచించారు.
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024