పొలిటికల్‌ దళారి చంద్రబాబు

పొలిటికల్‌ దళారి చంద్రబాబు

పొలిటికల్‌ దళారి చంద్రబాబు

YSRCP MP Vijaya Sai Reddy Slams Chandrababu In Twitter - Sakshiవిజయసాయి రెడ్డి, చంద్రబాబు నాయుడు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ, చంద్రబాబుల స్నేహ బంధంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ ద్వారా స్పందించారు. పొలిటికల్‌ దళారి చంద్రబాబు నాయుడు కొత్త అవతారం ఎత్తారని విమర్శించారు. (కాంగ్రెస్‌ రాహుల్‌ ‘బాబు’!)

మొన్నటి వరకు కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీని రాక్షసి అని, కాంగ్రెస్‌ను బొంద పెట్టాలని, తరిమి కొట్టాలని పెడబొబ్బలు పెట్టాడని చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ కాళ్లు పట్టుకుని ప్రజాస్వామ్యం కాపాడుదామని అంటున్నారని దుయ్యబట్టారు. కొంచెం కూడా సిగ్గూ శరం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అదే చంద్రబాబేనని విమర్శించారు. సోనియా గాంధీపై చంద్రబాబు గతంలో చేసిన విమర్శల క్లిప్లింగ్‌లను ట్యాగ్‌ చేశారు.

కాగా, దేశాన్ని నరేంద్ర మోదీ బారి నుంచి కాపాడేందుకే కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపినట్టు చంద్రబాబు గురువారం ఢిల్లీలో ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. (చంద్రబాబు సరికొత్త కాపురం కాంగ్రెస్‌తో..)


Recommended Posts