ఎవరెన్ని విధాలుగా రాజకీయం చేసినా, కుట్రలు పన్నినా…మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని స్పష్టం చేస్తున్నాను.
ఎవరెన్ని విధాలుగా రాజకీయం చేసినా, కుట్రలు పన్నినా…మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని స్పష్టం చేస్తున్నాను. ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గం పరిధిలోని కార్పోరేటర్లతో రామమూర్తి నగర్ లోని నా క్యాంపు కార్యాలయంలో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాన్ని వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ ఎండి ఖలీల్ ఆహ్మద్ గారిని , ఎంపీగా నన్ను గెలిపించేందుకు కృషి చేయమని కోరడం జరిగింది. సమావేశంలో సహచర రాజ్యసభ సభ్యుడు శ్రీ బీద మస్తాన్ రావు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిటీ అధ్యక్షుడు శ్రీ సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.