కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలంలోని పెయ్యలపాలెం గ్రామంలో నిన్న సాయంత్రం నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి, నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి..
కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలంలోని పెయ్యలపాలెం గ్రామంలో నిన్న సాయంత్రం నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి, నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీమతి పెనాక అనూష, స్థానిక పార్టీ నేతలు శ్రీ పెనాక శ్రీనివాసులు రెడ్డి, శ్రీ పెనాక సుభాష్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెయ్యలపాలెం నా వియ్యంకుల వారి గ్రామం కావడంతో ప్రచారానికి వెళ్లిన నా కుమార్తె, సతీమణి కి గ్రామస్థులు హారతులతో అఖండ స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇంటికి పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. గ్రామాన్ని నా వియ్యంకులు శ్రీ పెనాక రాంప్రసాద్ రెడ్డి గారు దత్తత తీసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో అరబిందో సంస్థ ఆద్వర్యంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని సభలో మాట్లాడుతూ నా కుమార్తె వివరించింది. గ్రామస్థులు చూపించిన ప్రేమ, ఆదరణకు నా సతీమణి, కుమార్తె ముగ్ధులయ్యారు. ప్రచారంలో భాగంగా ప్రజలు సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ని గెలిపించుకోవాలని, ఎంపీగా నన్ను, ఎమ్మెల్యే గా శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో నా సతీమణి, కుమార్తెలను తమ ఇంటి ఆడబిడ్డలుగా ఆదరించి వెంట నడిచిన నాయకులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.