విజయనగరాన్ని చంద్రబాబు విస్మరించాడు.

విజయనగరాన్ని చంద్రబాబు విస్మరించాడు – వెనుకబడ్డ వర్గాలను అణచివేశాడు.
(Part- 1)
విజయనగరం అనగానే విద్యలనగరం, సాంస్కృతిక కూడలి , సంగీత సెంటర్ ఇలా గత వైభవం కళ్లముందు మెదులుతుంది. సువర్ణముఖి, చంపావతి, గోస్తని, నాగావళి, వేగావతి, గోముఖ లాంటి నదీనదాలు ప్రవహిస్తున్న ప్రశాంతమైన జిల్లాను – గజపతి రాజుల్లో ఒక వర్గాన్ని, మాన్సాస్ ట్రస్ట్ ను ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో భ్రష్టుపట్టించాడు. మెజార్టీ వర్గాలైన కాపు, వైశ్య, ఎస్సీ,ఎస్టీలను పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా… వీలైనంతగా అణగదొక్కాడు చంద్రబాబు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికే ముఖ్యమంత్రులను అందించిన జిల్లా. ప్రజలు చైతన్యవంతులవ్వడంతో విజయనగరం జిల్లా అంతటా జగన్ గారి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ విజయదుందుభి మోగించింది. విశాఖతో సమానంగా విజయనగరాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ గారి ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది.
– విశాఖకు కూతవేటు దూరంలోనుంది విజయనగరం అలాంటిది వైజాగ్ పాలనా రాజధాని వద్దంటూ చంద్రబాబు సంతకాల సేకరణ చేయిస్తున్నాడంటే జిల్లాపై ఎంతగా పగబట్టారో అర్థం చేసుకోవచ్చు. పాలనా రాజధానైతే విశాఖ – విజయనగరం మధ్య అభివృద్ధి పరుగులుపెడుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి – విశాఖ మెట్రోరైలు వరకు అన్నీ విజయగరానికి వచ్చి… జిల్లా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది.
– జిల్లా రాజకీయాలను, అభివృద్ధిని కొన్ని కుటుంబాలకే పరిమితం చేశాడు చంద్రబాబు. విజయనగరం, బొబ్బిలి రాజుల్లో కొందరు తప్ప ఆయనకు సామాన్యులెవరూ కనిపించలేదు.
– విజయనగరంలోని మహారాజా విద్యాసంస్థలు బ్రిటిష్ వారిటైంలోనే ఒక వెలుగువెలిగాయి. అందుకే విజయనగరాన్ని విద్యల నగరమన్నారు. దక్షిణ భారతదేశంలో తొలి సంగీత కళాశాల పెట్టింది ఇక్కడే. కానీ మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గజపతి రాజు చేతిలోకి వెళ్లగానే దాన్ని భ్రష్టుపట్టించారు. ఇప్పుడు విద్యారంగంలో విజయనగరం అట్టడుగున ఉంది. 2011 లెక్కల ప్రకారం విజయనగరంలో అక్షరాస్యత 59 శాతమే… జాతీయ సగటుకన్నా 15 శాతం తక్కువ.
– అశోకుడిని అడ్డంపెట్టుకుని మాన్సాస్ ట్రస్ట్ ను చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏటీఎంలా వాడుకున్నారు. ఆ వివరాల్లోకెళ్తే అదో పెద్ద గ్రంథమే అవుతుంది.
– విజయనగరం జనాభాలో దాదాపు 20 శాతం తూర్పుకాపులు, కాపులే కానీ వారిలో రాజకీయ చైతన్యం వస్తే ఎక్కడ తమను పట్టించుకోరోనన్న కుట్రతో అణగదొక్కారు. ఉదాహరణకు చీపురుపల్లిలో గద్దె బాబురావును నాలుగుసార్లు గెలిపించడంతో అశోక్ గజపతిరాజు కీలకపాత్ర పోషించారు. అక్కడ కాపులకు మొండిచేయి చూపించారు. అంతెందుకు అశోకుని కుమార్తె అతిది పోటీచేస్తాననగానే సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు ఇంటికి పంపించేశారు.
– పంచనదులున్నా చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క సాగునీటి లేదా తాగునీటి ప్రాజెక్టు కట్టిన పాపానపోలేదు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించాడు చంద్రబాబు.
– ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ, ప్రతిపక్ష నేతగానూ తనదే రికార్డని చెప్పుకునే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ – విజయనగరంలో ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజ్ పెట్టించలేకపోయాడు.
– విశాఖను పాలనా రాజధానిగా కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ పెద్ద మనుషులు విజయనగరాన్ని మురికికూపంలా మార్చేశారు. విద్యలనగరాన్ని అక్షరాస్యతలో నానాటికీ తీసికట్టుగా చేసేశారు .
– జిల్లావాసులకు ఉపాధికల్పిస్తున్న జ్యూట్, ఫెర్రో అలోయిస్ ఇండస్ట్రీలు మూతపడేలా చేశారు. రాష్ట్రమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి ఇంటిపక్కనే ఉన్న ఈస్ట్ కోస్ట్ , అరుణ జ్యూట్ మిల్లులు మూతపడ్డా – వందలమంది ఉద్యోగాలుపోయినా అటువైపు కనీసం కన్నెత్తి చూడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని తెరిపించేందుకు ప్రయత్నిస్తోంది.
– విజయనగరంలో చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్కటి ఉపాధి కల్పించే సంస్థను స్థాపించలేదు. అందుకే ఏటా వేలమంది గ్రామాలకు గ్రామాలనే ఖాళీచేసి సుదూరప్రాంతాలకు వలసవెళ్లిపోవాల్సిన దుస్థితి దాపురించింది.
– ఈ ఇసుకదేశం పార్టీకి ఇసుకపై ఉన్న దృష్టి… విజయనగరంలోని సువర్ణముఖి, చంపావతి,గోస్తని,నాగావళి,వేగావతిపై ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కట్టాలన్న ఉద్దేశం లేకుండాపోయింది. ఈ నదుల్లోని ఇసుకను మాత్రం తోడేసి – ఇసుకదేశం పార్టీ అన్న పేరును సార్ధకం చేసుకుంది.
– జిల్లా నుంచి పెద్ద పెద్ద పోస్టులు వెలగబెట్టిన అశోక్ గజపతి రాజు చంద్రబాబు సేవలో తరించారే తప్ప – ప్రజలకు చేసిందేమీ లేదు. రాజదర్పం ప్రదర్శించడం తప్ప సామాన్యుల కష్టాలు చూసింది లేదు. కోట బయటకొచ్చి వారి కష్టాలు విన్న సందర్భాలే లేవు.
– విజయనగరంలోని చారిత్రక PW మార్కెట్ తమ భూముల్లోనే ఉందని… ఓట్లేయకపోతే ఖాళీ చేయించేస్తానంటూ ఎన్నికల ముందు బెదిరిస్తూ చాలా కాలం పబ్బం గడుపుకున్నారు కానీ ఇకపై ఆ పప్పులుడకవు. రాజులకన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యం… ప్రజా సమస్యలు పట్టించుకుని – వారికోసం పనిచేసేవారే మిగులుతారు.
Recommended Posts
Casino Online Que Acepta Mastercard
26/06/2025
Paypal Casino Utan Svensk Licens
20/12/2024
CASINO MUNKEBJERG
28/10/2024