చంద్రం, అచ్చం నాయుళ్లు కలిసి శ్రీకాకుళంను చిదిమేశారు

చంద్రం, అచ్చం నాయుళ్లు కలిసి శ్రీకాకుళంను చిదిమేశారు

చంద్రం, అచ్చం నాయుళ్లు కలిసి శ్రీకాకుళంను చిదిమేశారు – మనవాడు కాకపోతే హింసించడమే వారి సిద్ధాంతం.

Part-3

శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది… కానీ అభివృద్ధి జరిగింది మాత్రం వైఎస్ హయాంలో మళ్లీ ఇప్పుడు జగన్ గారి పాలనలో మాత్రమే. వంశధార ప్రాజెక్టు, ఆఫ్ షోర్ ప్రాజెక్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, పలాసలో 600 పడకల కిడ్నీ పేషెంట్ల కోసం ఆస్పత్రి , కిడ్నీ పేషెంట్లకు 10 పెన్షన్ , మెడికల్ కాలేజ్ , ఇరిగేషన్ పెంపు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో. చంద్రబాబు హయాంలో వేధింపులు – కేవలం కొన్ని కుటుంబాలకు లబ్ధి తప్ప చేసిందేమీ లేదు. పాయింట్ టూ పాయింట్ ఇక్కడ చూద్దాం.

-టెక్కలి నియోజకవర్గంలో రెడ్డిక, మత్స్యకార కులాల ఓట్లతో నెగ్గుకొస్తున్న ఎర్రన్నాయుడు గానీ, అచ్చెన్నాయుడు గానీ ఒక్కటంటే ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా వారికివ్వలేదు. జస్ట్ ఎన్నికల సమయంలో బకరాలు చేయడంలో మాత్రం చంద్రన్న – అచ్చన్న దిట్టలే.

– టెక్కలి నియోజకవర్గంలో మత్స్యకార జనాభా గణనీయ సంఖ్యలో ఉంది. వారిని ఎన్నికల సమయంలో మేనేజ్ చేయడం – బెదిరించి ఓట్లేయించుకోవడం తప్ప… కనీసం ఒక్కటంటే ఒక్క శీతల గిడ్డంగి కట్టమని వందల సార్లు ప్రాదేయపడినా… ఎర్రన్న, అచ్చెన్న పట్టించుకున్న పాపానపోలేదు. జస్ట్ బస్ షెల్టర్లు కట్టడం – తమ పేర్లును బస్సుకన్నా పెద్ద సైజులో రాయించుకోవడం తప్ప చేసిందేమీ లేదు.

-టెక్కలి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలు (తండాలు) ఉన్నాయి. వారంతా ఐటీడీఏ సీతంపేట పరిధిలో కలపాలని దశాబ్దాలుగా మొరపెట్టుకుంటున్నారు. అయినా ఒక్కనాడూ పట్టించుకోలేదు.

– జిల్లాలో ఒకే కులంలో చిచ్చుపెట్టడం – ఆ కులంలో కొందరికి మందు, మనీతో ఎలక్షన్ల సమయంలో చేరదీయడం – చంద్రబాబు డైరెక్షన్ లో వారిలో వారికే గొడవలుపెట్టి పబ్బం గడుపుకోవడం ఎర్రన్న కుటుంబ స్టైల్.

గతంలో జరిగిన ఎన్నికల్లో కోటబొమ్మలి మండలం పిన్నింటిపేట కూడలి వద్ద టైలర్ కూన. రామారావు హత్య జరిగింది… అందులో ఏ1 గా ఉండేవాడు అచ్చెన్నాయుడు . అధికారాన్ని అడ్డంపెట్టుకుని మేనేజ్ చేయడంలో దిట్టైన చంద్రబాబు సహకారంతో కేసు నీరుగార్చారు.

– అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడ ఎన్నికల బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ ను కొట్టిన కేసులో నరసన్నపేట కోర్టు అచ్చెన్నాయుడుకు ౩ నెలల జైలు శిక్ష వేసింది. దాన్ని జిల్లా కోర్టులో సవాల్ చేయగా అతనికి ఒకరోజంతా కోర్టులో నిలబెట్టింది… వార్నింగ్ ఇచ్చి పంపించడం జరిగింది.

– టెక్కలి పట్టణంలో రోడ్లు వెడెల్పు సమయంలో వారు మనకు ఓట్లేసినవారు(మనవారు)కాదన్న కోపంతో స్థిరనివాసాలు (ఇళ్లను) దగ్గరుండి కొట్టించాడు అచ్చెంనాయుడు. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా – అది అధికారులకు అందేలోపే — పోలీసులను దగ్గర పెట్టుకుని దుర్మార్గానికి పాల్పడి పైశాచిక ఆనందం పొందాడు.

– సొంత గ్రామం నిమ్మాడలో అచ్చెన్నపైనున్న అత్యాచారరం కేసును ఆయన మంత్రయ్యాక చంద్రబాబు ప్రభుత్వం పక్కదోవపట్టించింది.

– అధికారి మనవాడు కాకపోతే వేధించడం – అచ్చెన్నకు వెన్నతోపెట్టిన విద్య. వందల మంది కళింగ కులానికి చెందిన అధికారులను జిల్లా దాటించాడు. చంద్రబాబు అండతో అప్రధాన్య పోస్టుల్లో వేయించాడు. ఇక రెడ్డిక , మిగతా కులాల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఈయన చెప్పడం … మనవాళ్లు భ్రీఫ్డ్ మీ అంటూ చంద్రన్న “ఓకే” చెప్పడం పరిపాటిగా ఉండేది.

– జిల్లాలో అత్యధికంగా ఉన్న కళింక కులాన్ని రాజకీయంగా , ఆర్థికంగా దెబ్బకొట్టడమే పనిగా పెట్టుకున్నారు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు. వీరి దెబ్బకు తట్టుకోలేక చాలా మంది కళింగ నేతలు టీడీపీని వీడారు – ఇప్పటి స్పీకర్ తో సహా. ఇక టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ను మామూలుగా వేధించలేదు. కేసులు మీద కేసులు పెట్టి- ఆర్థికంగానూ దివాలాతీయించారు. కళింగ వర్గానికే చెందిన బొడ్డేపల్లి, అప్పయ్యదొర కుటుంబాలను అణగదొక్కారు.

– ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు ద్వారా జగన్ గారు ముఖ్యమంత్రయ్యాక నీరిస్తున్నారు. చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదు. చంద్రన్నకు – అచ్చన్నకు వెనుకబడ్డ శ్రీకాకుళం అంటే జస్ట్ ఒక ఓటు బ్యాంక్ మాత్రమే. ఆ విషయాన్ని విద్యారంగంలో ముందుకెళ్తున్న సిక్కోలు యువత ఇప్పుడు కనిపెట్టేసింది – ఇక ఉత్తరాంధ్రలో టీడీపీ అడ్రస్ గల్లంతే.

అందుకే అచ్చెన్నాయుడు అరెస్టు రోజు శ్రీకాకుళం జిల్లాలో జనం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు రోజులు మారాయి.