‘పథకంలో భాగంగా శ్రీనివాస్‌ను ఏం చేయబోతున్నారో?’

‘పథకంలో భాగంగా శ్రీనివాస్‌ను ఏం చేయబోతున్నారో?’
Oct 30, 2018, 20:16 IST

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు పరిస్థితిపై ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్లో స్పందించారు. ముందుగా అనుకున్న పథకంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు శ్రీనివాసరావును ఏం చేయబోతున్నారో.. అని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీతో సహా, అధికార టీడీపీ శ్రేణులు వ్యవహరించిన తీరును చూస్తుంటే.. వారి కుట్రాలోచనలు స్పష్టమవుతున్నాయని అన్నారు. చంద్రబాబు పిరికివాడే కానీ.. హత్యా రాజకీయాలలో అనుభవజ్ఞుడు అని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకే ఈ హేయమైన పిరికి చర్యకు పాల్పడ్డారని విమర్శించారు.
Recommended Posts
Platin Casino No Deposit Bonus
05/02/2025
Pokern – Texas Hold’em Regeln
03/10/2024