పాదయాత్రకు విశేష స్పందన

పాదయాత్రకు విశేష స్పందన
Sep 04, 2018, 07:37 IST
కె. కోటపాడు సభలో ప్రసంగిస్తున్న వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డి, అమర్‌నాథ్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు
ఆరు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు దిగ్విజయం
ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నం: ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని స్థాయిలో స్పందన లభిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. సోమవారం కె.కోటపాడు వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అలుపెరుగని పధికుడు జగన్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొనాలని, ఆయనతో కలిసి అడుగులో అడుగేయాలని, రాజన్న తనయుడిని తనివితీరా చూడాలన్న తపనతో అవ్వా తాతల నుంచి మహిళలు, యువతీ యువకులు, చిన్నారుల వరకు తపన పడుతున్నారన్నా రు. పాదయాత్రగా వస్తున్న జగన్‌ను చూసేం దుకు రోడ్లపైకి వచ్చి ఎంత సమయమైనా వేచిఉంటున్నారన్నారు. అవ్వా తాతలు అంది స్తున్న దీవెనలే జగన్‌కు శ్రీరామరక్ష అన్నారు. ఈ దఫా ఎన్ని ప్రలోభాలు ఎదురైనా జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలనే ధృడ సంకల్పంతో రాష్ట్ర ప్రజానీకం ఉందన్నారు. చంద్రబాబు మోసాలకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు వేలాదిగా అభిమాన జనం తరలిరావడం విశేషమన్నారు. విశాఖ పట్టణ ప్రజానీకం జగనన్న రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. మంగళవారం మధ్యాహ్నం నగర శివారులోని పెందుర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు.
Recommended Posts
Platin Casino No Deposit Bonus
05/02/2025
Pokern – Texas Hold’em Regeln
03/10/2024