కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఆంధ్ర రాష్ట్రనికి ద్రోహం చేశాయి.

కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఆంధ్ర రాష్ట్రనికి ద్రోహం చేశాయి.

కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఆంధ్ర రాష్ట్రనికి ద్రోహం చేశాయి. రాష్ట్రాన్ని గొడ్డలితో నరికి చంపింది కాంగ్రెస్‌. వైద్యం చేయిస్తాం…బాగు చేయిస్తాం అని హామీ ఇచ్చి రక్తపు మడుగులో వదిలేసింది బీజేపీ. ఈ రెండు పార్టీలకు అప్పుడు ఇప్పుడు సహకరిస్తున్నది ఇంటి దొంగ…తెలుగుదేశం పార్టీ.

ఇలాంటి పరిస్థితులలో రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి ఎన్నికలలో ఓటు ఎవరికి వేయాలి? బీజేపీకి ఎలాగూ వేయం. కాంగ్రెస్‌ పార్టీ కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్ధిని ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా నిలబెడతారని ముందుగా ప్రచారం చేశారు. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ అభ్యర్ధిని రంగంలోకి తీసుకువచ్చారు. కాంగ్రెస్‌కు ఓటు అంటే రాష్ట్ర విభజనకు ఓటు వేయడమే. కాబట్టి కాంగ్రెస్‌ అభ్యర్ధిని మేం సమర్ధించదలచుకోలేదు.

క్షణానికి ఒక రాజకీయం చేసి సిగ్గులేని తెలుగుదేశం పార్టీ తనకు తానుగా కాంగ్రెస్‌ అభ్యర్ధిని సమర్ధిస్తోంది. కానీ కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్ధులెవరినీ బలపరచకుండా ఓటింగ్‌ నుంచి గైర్జాజరు కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీ విజయ్‌ చౌక్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ మా పార్టీ వైఖరిని స్పష్టం చేయడం జరిగింది.


Recommended Posts