ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక (సవరణ) బిల్లుపై గురువారం రాజ్యసభలో…

ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక (సవరణ) బిల్లుపై గురువారం రాజ్యసభలో...

ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక (సవరణ) బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ, ఈ బిల్లులో కొన్ని లోపాలను ప్రస్తావిస్తూ వాటిని సరిదిద్దాలంటూ న్యాయ శాఖ మంత్రికి సూచించడం జరిగింది. ఈ బిల్లులో ప్రతిపాదించిన సవరణలో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 438 (ముందస్తు బెయిల్‌) కింద పొందుపరచిన నిబంధనలు వర్తించవని పేర్కొనడం జరిగింది. అయితే నిందితుడు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 482 కింద పొందుపరిచిన సెక్షన్‌ను వినియోగించుకుని ఎఫ్‌ఐర్‌ను కొట్టి వేయవలసిందిగా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపాన్ని చక్కదిద్దకపోతే ఈ బిల్లు ఉద్దేశమే దెబ్బతింటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది.