నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్శిటీ స్థాపనకు ఉద్దేశించిన బిల్లుపై గురువారం రాజ్యసభలో…

నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్శిటీ స్థాపనకు ఉద్దేశించిన బిల్లుపై గురువారం రాజ్యసభలో...

నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్శిటీ స్థాపనకు ఉద్దేశించిన బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడటం జరిగింది. దేశంలో తలసరి ఆదాయం ప్రాతిపదికన చూస్తే క్రీడలపై పెడుతున్న పెట్టుబడులు అతి తక్కువగా ఉన్నాయి.

అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలో మనకంటే అయిదారు రెట్లు క్రీడలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఇక క్రీడల కోసం ప్రత్యేకంగా యూనివర్శిటీ స్థాపన ఆహ్వానించదగ్గ చర్య. అయితే ఈ వర్శిటీ స్థాపన ద్వారా ఆశించే అంతిమ ఫలితాలు, వర్శిటీ పనితీరు, పారదర్శకత, యాజమాన్యం ప్రతిభా సామర్ధ్యాలపై ఆధాపడి ఉంటుంది.

దేశంలో క్రీడా రంగాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా అభివృద్ధి చేయాలంటే ప్రతి జోన్‌లోను స్పోర్స్ట్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది.