హోమియోపతి సెంట్రల్‌ కౌన్సిల్‌ (సవరణ) బిల్లుపై గురువారం రాజ్యసభలో…

హోమియోపతి సెంట్రల్‌ కౌన్సిల్‌ (సవరణ) బిల్లుపై గురువారం రాజ్యసభలో...

హోమియోపతి సెంట్రల్‌ కౌన్సిల్‌ (సవరణ) బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడటం జరిగింది. హోమియోపతి సెంట్రల్‌ కౌన్సిల్‌లో అనేక చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కౌన్సిల్‌ సభ్యులు ఎవరు? అలాంటి వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో మంత్రి సభకు వివరించాలి.

ఇక హోమియోపతి కాలేజీల పనితీరు ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. ఆ కాలేజీల పనితీరును కొలిచే ప్రామాణికాలు ఏమిటి? అనేక హోమియో కాలేజీల ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. వాటి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? హోమియోపతి వైద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటి? వైద్య వృత్తి పట్ల ఆసక్తి కనబరచే వారు హోమియోపతి కోర్సును చేపట్టేలా ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలను రూపొందించింది? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది.