రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో…

రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో...

రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో… ముఖ్యంగా అరకు, పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సౌర, పవన విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది…అంటూ నేను అడిగిన ప్రశ్నకు రెన్యూవబుల్‌ విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్‌ కుమార్‌ సింగ్‌ జవాబిస్తూ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల కోసం రెండు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు.

అందులో మొదటిది గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులకు సోలార్‌ పంప్‌ సెట్ల పంపిణీతోపాటు సాగుకు పనికిరాని భూముల్లో మినీ సోలార్‌ ప్లాంట్‌లను ఏర్పాట చేసి విద్యుత్‌ ఉత్పాదన చేయడం. ఈ విధంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి తద్వారా లభించే ఆదాయంలో కొంత ఆ భూములకు చెందిన రైతులకు చెల్లించడం ఈ పథకం ఉద్దేశంగా మంత్రి తెలిపారు.