గ్రామీణ డాక్‌ సేవక్‌లకు న్యాయం చేయండి.

గ్రామీణ డాక్‌ సేవక్‌లకు న్యాయం చేయండి.

గ్రామీణ డాక్‌ సేవక్‌లకు న్యాయం చేయండి.
రాజ్య సభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి…

దేశంలోని సుమారు 2 లక్షల 80 వేల మంది గ్రామీణ డాక్‌ సేవక్‌ల సమస్యలను ప్రత్యేక ప్రస్తావన ద్వారా శుక్రవారం రాజ్య సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. గ్రామీణ డాక్‌ సేవకుల సమస్యలపై అధ్యయనం చేసిన కమలేష్‌ చంద్ర కమిటీ అనేక కీలకమైన సిఫార్సులను చేసింది. కానీ ఆ సిఫార్సులను ప్రభుత్వం మొక్కుబడిగా అమలు చేయడం వలన వారికి తీరని అన్యాయం జరుగుతోంది. కాబట్టి కమిటీ సిఫార్సులలో ప్రధానమైన అయిదింటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి వారికి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.