రాజ్య సభలో శుక్రవారం నేను రెండు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది.

రాజ్య సభలో శుక్రవారం నేను రెండు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది.

రాజ్య సభలో శుక్రవారం నేను రెండు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మొదటిది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19కి సవరణ చేయాలని. ఆర్టికల్‌ 19లోని క్లాజ్ 3, 4లో ఉన్న భారతదేశం సమగ్రత, సార్వభౌమత్యం అనే పదాన్ని తొలగించాలన్న ఉద్దేశం. ఈ పదం వలన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 కింద కల్పించిన ప్రాధమిక హక్కులను పరిమితం చేస్తున్నందున దీనిని సవరణ ద్వారా తొలగించాలన్నది లక్ష్యం.

రెండో బిల్లు క్రిమినల్‌ లా (సవరణ)కు ఉద్దేశించినది. సమాజంలో వైవాహిక బంధం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తున్నాం. దీనిని కాపాడటానికి లింగ వివక్ష లేకుండా మహిళకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నందున క్రిమినల్‌ లా లోని 497 సెక్షన్‌ను సవరించాలన్నది ఈ బిల్లు లక్ష్యం.