‘పుకార్లు, నకిలీ వార్తల ప్రచారంతో సోషల్‌ మీడియా వేదికల దుర్వినియోగం’…

'పుకార్లు, నకిలీ వార్తల ప్రచారంతో సోషల్‌ మీడియా వేదికల దుర్వినియోగం'...

‘పుకార్లు, నకిలీ వార్తల ప్రచారంతో సోషల్‌ మీడియా వేదికల దుర్వినియోగం’ అనే అంశంపై గురువారం రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ నా అభిప్రాయాలను ఈ విధంగా చెప్పడం జరిగింది.

మత విశ్వాసాలు, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్‌ మీడియాలో పుంఖానుపుంఖాలుగా సాగుతున్న ఈ ట్రెండ్‌ రాను రాను చాలా ప్రమాదకరంగా మారింది. సోషల్‌ మీడియా వేదికలలో కొనసాగుతున్న సామూహిక ఉన్మాద ధోరణులు, మతపరమైన ప్రతిస్పందనలు ఆందోళనకర స్థాయికి చేరాయి.

భావ ప్రకటన స్వేచ్ఛకు, నిందాపూర్వక, విద్రోహకరమైన వ్యక్తీకరణలకు మధ్య విభజన రేఖ ఎక్కడ గీయగలుగుతాం? ప్రభుత్వం దీనిపై గట్టిగా దృష్టిసారించి చర్యలకు ఉపక్రమించకపోతే ఈ ధోరణి సమాజానికి, దేశానికి కూడా చేటు చేస్తుందన్నది నా ఆందోళన.