ఆం.ప్రలో గిరిజన సలహా మండలి ఏర్పాటులో జరుగుతున్న తీవ్రమైన జాప్యంపై రాజ్యసభలో ప్రస్తావన

ఆం.ప్రలో గిరిజన సలహా మండలి ఏర్పాటులో జరుగుతున్న తీవ్రమైన జాప్యంపై రాజ్యసభలో ప్రస్తావన

ఆం.ప్రలో గిరిజన సలహా మండలి ఏర్పాటులో జరుగుతున్న తీవ్రమైన జాప్యంపై రాజ్యసభలో ప్రస్తావన

ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విపరీతంగా కాలయాపన చేస్తోందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరామ్ ను ప్రశ్నించడం జరిగింది. రాజ్యసభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా ఒక అనుబంధ ప్రశ్న వేస్తూ రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలు నిర్దేశించిన విధంగా దేశంలో గిరిజన ప్రాంతాలు కలిగిన ప్రతి రాష్ట్రంలో గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఒక గిరిజన సలహా మండలిని విధిగా ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడచిపోయింది. అయినప్పటికీ ఇప్పటి వరకు గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మంత్రిని ప్రశ్నించడం జరిగింది.

దీనికి మంత్రి శ్రీ జుయల్ ఓరామ్ సమాధానం చెబుతూ ఏ రాష్ట్రంలోనైనా గిరిజన సలహా మండలి ఏర్పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతుందని తెలిపారు. సలహా మండలిలో ఏజెన్సీ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉంటారని, ఈ మండలి ఏర్పాటు, దాని పనితీరుపై కేంద్రం ఆయా రాష్ట్రాలతో ఏడాదికి రెండుసార్లు సంప్రదింపులు జరుపుతుంది. ఇక నుంచి ఆయా రాష్ట్రాలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సభకు తెలిపారు.