సార్వత్రిక విజయానికి కాకినాడ నాంది కావాలి

సార్వత్రిక విజయానికి కాకినాడ నాంది కావాలి

సార్వత్రిక విజయానికి కాకినాడ నాంది కావాలి

Sakshi | Updated: August 20, 2017 07:11 (IST)
సార్వత్రిక విజయానికి  కాకినాడ నాంది కావాలి

♦ కాకినాడ నగరంలో 30 స్థానాలు గెలవడం ఖాయం
♦ ఇది నేను చెబుతున్న మాట కాదు వివిధ సర్వేలు స్పష్టం చేసిన నిజం
♦ అలా అని నిర్లక్ష్యం తగదు… విజయం స్ఫూర్తితో కసితో కృషి చేయాలి
♦ బీజేపీతో పొత్తు నంద్యాలలోఎందుకు పెట్టుకోలేదు
♦ టీడీపీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి
♦ నవరత్న పథకాల విశిష్టతలను వివరిస్తూ విస్తృత ప్రచారం చేయాలి
♦ కార్పొరేషన్‌ ఎన్నికలపై సమన్వయకర్తలతో సమీక్షలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన
♦ కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపు

రానున్న సార్వత్రిక ఎన్నికల విజయానికి కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల విజయం నాందీ కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి అరాచకపాలన పార్టీని విజయం వైపు నడిపించగలవన్నారు. కాకినాడలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ నంద్యాలలో మాత్రం ఆ పార్టీతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ వైఖరిని కూడా ఎండగట్టి ప్రజలకు తెలియజెప్పాలన్నారు. పార్టీ శ్రేణులు, సమన్వయకర్తలు మరింత కష్టపడి పనిచేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండగలవన్నారు.

కాకినాడ : రానున్న సార్వత్రిక ఎన్నికల విజయానికి కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల విజయం నాంది కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎస్వీఎన్‌ గ్రాండ్‌ ఫంక్షన్‌హాలులో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణాజిల్లాల పార్టీ సమన్వయకర్తల సమావేశానికి వైఎస్సార్‌సీపీజిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి అరాచక పాలన వంటి అంశాలు పార్టీని విజయం వైపు నడిపించగలవన్నారు. కాకినాడలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ నంద్యాలలో మాత్రం ఆ పార్టీతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ వైఖరిని కూడా ఎండగట్టి ప్రజలకు తెలియజెప్పాలన్నారు. సర్వే నివేదికల ప్రకారం 30 స్థానాలకు పైగా వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని, పార్టీ శ్రేణులు, సమన్వయకర్తలు మరింత కష్టపడి పనిచేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండగలవన్నారు. ప్రతి గడపకు వెళ్లి నవరత్న పథకాలతోపాటు తెలుగుదేశం ప్రభుత్వ వంచనను ప్రజలకు తెలియచెప్పాలన్నారు.

ఈ ఎన్నికల్లో సీట్ల పంపిణీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించాం కానీ బ్రాహ్మణులకు అవకాశం వ్వలేకపోయామని, దానికి కారణం ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడమే అన్నారు. మేం గెలిచాక వీరికి సముచిత స్థానం కల్పిస్తాం..అని అన్నారు.  సమావేశంలో మాజీ మంత్రులు ఎం.పార్థసారథి, కొప్పన మోహనరావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, విశ్వసరాయి కళావతి, బూడి ముత్యాల నాయుడు, కోన రఘుపతి, కంబాల జోగులు, పి.రాజన్నదొర, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నా«థ్, విజయనగరం జిల్లా పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, గొల్ల బాబూరావు, తానేటి వనిత, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరి కృష్ణంరాజు,  పెండెం దొరబాబు, పాముల రాజేశ్వరిదేవి, పి.బాలరాజు, పాతపాటి సర్రాజు,  మల్లా విజయప్రసాద్, ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి, జెడ్పీమాజీ ఛైర్మన్‌ చెల్లుబోయిన వేణు,  జిల్లా కో–ఆర్డినేటర్లు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, తోట సుబ్బారావు నాయుడు, డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు,  వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, అమలాపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జి వలవల బాబ్జి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు కొల్లి నిర్మలాకుమారి, సిరిపురపు శ్రీనివాసరావు, పెట్టా శ్రీనివాసరావు,  రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు,  రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, వట్టికూటి రాజశేఖర్, చెల్లుబోయిన శ్రీనివాస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, బీసీసెల్‌ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు,  మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, వివిధ జిల్లాల కో–ఆర్డినేటర్లు పెనుమత్స సురేష్‌బాబు, కరణం ధర్మశ్రీ, ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్,  కోలా గురువులు, అన్యంరెడ్డి అదీప్‌రాజు, బొడ్డేటి ప్రసాద్, దయ్యాల నవీన్‌బాబు, గున్నం నాగబాబు, సలాది వెంకట్రావు, కౌలు శ్రీనివాసరావు, గున్నం నాగబాబు, రాష్ట్ర పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, పక్కి దివాకర్, ఏలూరు పార్లమెంట్‌ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

భేతాళ మాంత్రికుడిలా  చంద్రబాబు : చెవిరెడ్డి
కార్పొరేషన్‌ ఎన్నికల కోర్‌ కమిటీ సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ మూడున్నరేళ్ళుగా ఎన్నో అరాచకాలు, దౌర్జన్యాలు, వేధింపులను ఎదుర్కొన్నారని, పార్టీ శ్రేణులు ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి రానున్న సార్వత్రిక విజయానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. కుట్రలు, కుతంత్రాలతో భేతాళ మాంత్రికునిగా మారిన చంద్రబాబుకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఆలీబాబా 40 దొంగల్లా…. ఇప్పుడు చంద్రబాబు… 40 దొంగలు(మంత్రులు) త్వరలోనే ఇక్కడ ఎన్నికలపై విరుచుకుపడే పరిస్థితి ఉందన్నారు. వీరిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలన్నారు.

రూ.వేల కోట్ల అవినీతికి తెరతీసిన టీడీపీ : ధర్మాన
జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రూ.వేలకోట్ల అవినీతికి తెరతీసిందని విమర్శించారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఎత్తిపోతల పథకాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఎన్నో గొప్పలు చెప్పినా స్మార్ట్‌సిటీ ముందుకు సాగడంలేదన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్‌ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని మెజార్టీ స్థానాలు గెలుచుకుని మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోగలమన్నారు.

ఇవి ప్రీ ఫైనల్స్‌ : పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్‌ ఎన్నికలను ప్రీ పైనల్స్‌గా అభివర్ణించారు. పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ అధికారపార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్‌ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా రూ.10 లక్షలు వసూలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయని, దీనిని బట్టి ఆ పార్టీ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చునన్నారు. కాకినాడ పార్లమెంట్‌ కో–ఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్‌ మాట్లాడుతూ ఎక్కడ చూసినా ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోందని, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించగలదని ధీమాగా చెప్పారు.

సిటీ కో–ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కాకినాడ మేయర్‌పీఠాన్ని కైవసం చేసుకుని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు. మరో కో–ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ మాట్లాడుతూ గడచిన పాతికేళ్లలో కాకినాడ మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన దాఖలాలు లేవని, ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగుతుందన్నారు.

ఈ సందర్భంగా విశాఖ జిల్లాకు చెందిన రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కొండా రాజీవ్‌గాంధీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రావు చిన్నారావు, జాన్‌ వెస్లీ,  మిండగుదిటి మోహన్, విశాఖజిల్లా పార్టీ నాయకులు శ్రీనివాస్, ముమ్మిడివరం ఫ్లోర్‌లీడర్‌ కాశి మునికుమారి, రాష్ట్ర బీసీసెల్‌ కార్యదర్శి అల్లి రాజబాబు, మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచనలిచ్చారు.


Recommended Posts