సంచార జాతి ప్రజల అభ్యున్నతికి కోసం తీసుకున్న చర్యలు ఏమిటి?

సంచార జాతి ప్రజల అభ్యున్నతికి కోసం తీసుకున్న చర్యలు ఏమిటి?

సంచార జాతి ప్రజల అభ్యున్నతికి కోసం తీసుకున్న చర్యలు ఏమిటి?

డీనోటిఫై చేసిన జాతులకు చెందిన ప్రజల అభ్యున్నతి, జీవన ప్రమాణాల మెరుగు కోసం ఆయా జాతులకు చెందిన జాతీయ కమిషన్ జూలై 2017లో చేసిన తాత్కాలిక నివేదికను ప్రభుత్వం ఆమోదించినదా? ఆమోదించినట్లయితే కమిషన్ నిర్దేశించిన లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? అంటూ గురువారం రాజ్య సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రిని ప్రశ్నించడం జరిగింది.

దీనికి ఆ  శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ సమాధానం చెబుతూ, కమిషన్ సమర్పించిన తాత్కాలిక నివేదిక ప్రభుత్వం పరిశీలించి, దీనిపై తుది నివేదికలో తగిన సిఫార్సులు చేయవలసిందిగా నీతి అయోగ్ను కోరినట్లు చెప్పారు. తుది నివేదిక వచ్చిన వెంటనే ఆయా జాతి ప్రజల అభ్యున్నతి  జీవన ప్రమాణాల మెరుగు కోసం ప్రభుత్వం తప్పని సరిగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.