విశాఖ ఐటీఐఆర్‌లో ముందడుగు లేదు
విశాఖ ఐటీఐఆర్‌లో ముందడుగు లేదు
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రతిపాదన( ఆగస్టు 26, 2014)ను ఇంకా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి పంపించలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి ఆల్ఫోన్స్ కన్నాంతనమ్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం తరుపున లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గతంలో భువనేశ్వర్‌లో కూడా ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా వచ్చిందని అయితే దీని ఏర్పాటులో సమగ్రంగా పున: పరిశీలించాలని ఆదేశించామని, ఆ ఆదేశాల అనంతరం అందులో సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఈ సవరణ మేరకు కేబినెట్ కమిటీకి ఒక నోట్ కూడా సమర్పించామని, అది జరిగితే ఏపీ ప్రతిపాదనను పంపిస్తామన్నారు. అలాగే జీఎస్‌టీ తర్వాత రైల్వే కాంట్రాక్ట్ పనుల విషయంలో కోరిన వివరణకు కూడా కేంద్రం సమాధానం చెప్పింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దక్షిణ మధ్య రైల్వేలోని ఓపెన్ లైన్, కన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్‌లో కాంట్రాక్టర్లు తాత్కాలికంగా పనులు నిలిపేసిన విషయం వాస్తవమేనని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. అయితే, శాఖ పరమైన వనరులను తరలించి ఎక్కడ అవసరం అయితే అక్కడ ట్రాక్ భద్రత పనులు కొనసాగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024