ప్రజలతో మమేకమై…

ప్రజలతో మమేకమై...

With People - Sakshi

చిన్నపాలెంలో ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర

విలీన గ్రామాల్లో విజయసాయి రెడ్డి పర్యటన       గ్రామ గ్రామాన సమస్యల నివేదన

సాక్షి, అగనంపూడి (గాజువాక) : జీవీఎంసీ 55వ వార్డు పెదగంట్యాడ మండల శివారు గ్రామాల్లో రాజ్య సభ సభ్యులు, వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బైక్‌ర్యాలీగా వెళ్లి  గ్రా మాల్లోని పెద్దలు, మహిళలు, గ్రామ నాయకులతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హా మీ ఇచ్చారు. మెడ్‌టెక్‌ మెయిన్‌ గేటు వద్ద నుంచి ప్రారంభమైన పర్యటన మదీనాబాగ్, ఇస్లామ్‌పే ట, పెదపాలెం, చినపాలెం, పిట్టవానిపాలెం, మరడదాసుడుపేట, దేవాడ, ఒనుముదొడ్డి, యల మంచిలిదొడ్డి, నమ్మిదొడ్డి, ఈసరవానిపాలెం, గొరుసువాని పాలెం, భూసదొడ్డి, పాలవలస, మురిభాయి, చేపలపాలెం (అప్పికొండ) సోమేశ్వరస్వామి గుడి, అప్పికొండ దాసరిపేట, మద్దివానిపాలెంలో వరకు సాగింది. ముందుగా మెడ్‌టెక్‌ భూ సమస్య, ఉపాధిపై విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎండీ దావూద్, పెదపాలెం, చినపాలెం గ్రామపెద్దలు మదీనా వ ల్లీ, బాదుల్, సన్నా, అన్వర్, ఆదిల్, బాబాలు వినతిపత్రాలు అందించారు. ఇస్లామ్‌పేటకు చెందిన 162 మంది ఎక్స్‌సర్వీస్‌ మెన్‌లకు చెందిన భూములను మెడ్‌టెక్‌ కోసం సేకరించి కనీసం నష్ట పరి హారం కూడా  చెల్లించకపోడంపై స్థానికులు ఆవేదన చెందారు. సర్దార్‌ మాస్టర్, మహమ్మద్‌ ముస్తాఫాల సారధ్యంలో వీరు వినతిపత్రాన్ని అందించారు. మసీదుకు ట్రాన్స్‌ఫార్మర్, జనరేటర్లు కావాలని కోరడంతో విజయసాయిరెడ్డి స్పందించి జనరేటర్‌ను తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

ఇస్లామ్‌పేట, పెదపాలెం, చినపాలెంకు చెంది న 5380 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూములకు ఈనా మ్‌ చట్టం ప్రకారం పట్టాలిచ్చి రద్దుచేశారు. పాత రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. పిట్టవానిపాలెంలో ఎన్టీపీసీ ఫ్లయాస్‌ వల్ల పడుతున్న ఇబ్బందులను గ్రామస్తులు విజయసాయి రెడ్డికి పిట్టా సింహాచలం, బొట్ట అప్పలరెడ్డి, బట్టు వెంకటరెడ్డి, సావిత్రి విజయసాయిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. హిందూజా రైలు పట్టాల కోసం సేకరించిన భూములకు సంబంధించి నష్ట పరిహారం చెల్లించలేదని పి.నాగేశ్వరరావు, వి.వెంకటరావు, సోంబాబు, నౌషద్‌ తదితరులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ వల్ల  ఈసరపువానిపాలెంలో సామాజిక భవనం దెబ్బతిందని, నేటికీ వాటిని పునర్నించమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఈసరపు వెంకటరావు, దాకారపు అప్పారావు, జగ్గారావు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు.

     గొరుసువానిపాలెంలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలపై మద్ది అప్పారావు, రమణ, అప్పలనాయుడు, కనకరెడ్డి, బసా రమణరెడ్డి తదితరులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరంఎంపీ విజయసాయిరెడ్డిని  గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. భూసదొడ్డిలోని అమ్మవారి ఆలయంలో విజయసాయిరెడ్డి పూజలు చేసిన అనంతరం పాలవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా  హిందూజా పవర్‌ప్లాంట్‌ డ్రైనేజీ తవ్వడంతో వర్షాలకు ఇబ్బందులు పడుతున్నామని మద్ది పైడిరెడ్డి, రావాడ అప్పలరెడ్డి, వెంపాడ పైడిరెడ్డి తదితరులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మురుభాయి గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో భూములన్నీ స్టీల్‌ప్లాంట్‌ ఆధీనంలో ఉన్నాయి. గ్రామం అడుగుపెట్టాలాన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించాలని నాయకులు  దేముడు, గౌరేష్, తాతారావు వేడుకున్నారు.

     అప్పికొండ (చేపలపాలెం)లోని సోమేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ కలుషిత జలాలను సముద్రంలోకి వదిలేస్తుందని, శుద్ధి చేసి నీటిని వదలాల్సి ఉండగా, వ్యర్థ నీటినే వదులుతుండంతో స్థానికులు ¿¶ఆందోళన చెందుతున్నామని నాయకులు పంది అప్పారావు, దాసరి తాతారావు చెప్పారు. తరువాత  అప్పికొండ దాసరిపేట, మద్దివానిపాలెంలో గ్రామాల్లో పర్యటించారు. వైఎస్సార్‌సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, 55వ వార్డు సమన్వయకర్త బట్టు సన్యాసిరావు సార«ధ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కళ్యాణి,  జిల్లా నాయకులు బర్కత్‌ ఆలీ, పక్కి దివాకర్, రవిరెడ్డి, సీఈసీ సభ్యులు పైలా శ్రీనివాసరావు, బీసీ సెల్‌ అధ్యక్షుడు రాము నాయుడు,   56, 57, 60 వార్డుల అధ్యక్షుడు పూర్ణానందశర్మ, దాడి నూకరాజు, దాసరి రాజు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గెడ్డం ఉమ పాల్గొన్నారు.