డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తాం

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తాం

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తాం

లాభాలు ఆర్జించే ప్రభుత్వరంగ సంస్ధలను ప్రైవేటీకరించడం సరికాదు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న డ్రెడ్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) లాభాల్లో నడుస్తోంది. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణపై రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తే అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అంశాన్ని మరోసారి పార్లమెంట్ లో లేవనెత్తుతాం. ఈ పార్లమెంట్‌ సమావేశాలో కేంద్రం తీసుకువస్తున్న ఎఫ్ ఆర్ డీ ఐ బిల్లు చట్టరూపం దాలిస్తే డిపాజిటర్లకు నష్టం వాటిల్లుతుంది.. ఎఫ్ ఆర్ డీ ఐ చట్టం పూర్తిగా ప్రజావ్యతిరేకం. ఎఫ్ ఆర్ డీ ఐ చట్టం పైనా కేంద్రాన్ని నిలదీస్తాం.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసే వ్యవహారంలో ఉపరాష్ట్రపతిని ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలి.


Recommended Posts