జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) సవరణ బిల్లుపై

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) సవరణ బిల్లుపై

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) సవరణ బిల్లుపై ఈరోజు రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్లో బ్యాంకుల నుంచి వ్యవసాయ రంగానికి అందాల్సిన రుణాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం పట్ల  ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.

వ్యవస్థాగత రుణాలు సకాలంలో అందక రైతాంగం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. దీని వలన రైతులు క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది. ఈ దుస్థితి నుంచి రైతులను బయటపడేసేందుకు ప్రభుత్వం తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించకపోతే రైతన్నల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.