చంద్రబాబు సామాజిక, ఆర్థిక, రాజకీయ నేరగాడు.
చంద్రబాబు సామాజిక, ఆర్థిక, రాజకీయ నేరగాడు. అవినీతి పరుడైన ఆయనకు ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. విశ్వసనీయత లేనందునే అపాయింట్‌మెంటు ఇవ్వడం లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పెద్ద ఎత్తున సంపద, డబ్బును… ప్రజల రక్తం పీల్చి చేజిక్కించుకున్నారు ఆ అక్రమ డబ్బును విదేశాలకు తరలించారు అందుకే చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదు.
విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టినా దానికి వైయస్సార్‌సీపీ మద్దతు ఇస్తుంది. హోదా కోసం అవిశ్వాస తీర్మానం ఇచ్చాం. టీడీపీ కేవలం ఒక నిమిషంలో తన వైఖరిని మార్చుకున్నది ఉదయం 9-30 గంటల దాకా టీడీపీ ఎన్డీఏలో ఉంది. ఉదయం 9-31కి ఎన్‌డీఏ నుంచి బయటికి రావాలని నిర్ణయం. ప్యాకేజి అన్న పెద్ద మనిషి ఇవాళ హోదా కావాలని అడుగుతున్నారు. అనైతిక రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు.
వైయస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనన్నారు. నిజాయతీ లేని వ్యక్తి తిరిగి మరో తీర్మానాన్ని ఇచ్చారు. హోదా కోసం ఎవరు ముందుకు వచ్చినా వారికి మా మద్దతు ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను వీఐపీలను విధిగా కలుస్తా. ఇందులో తప్పేముంది? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ముఖ్యమంత్రి ని కలవరా? చంద్రబాబు ఒకసారి ప్రొటోకాల్ పుస్తకం చదవాలి. నిబంధనలను తెలుసుకోవాలి…
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024