చంద్రబాబు చార్లెస్‌ శోభరాజ్‌కు గాడ్‌ ఫాదర్‌

చంద్రబాబు చార్లెస్‌ శోభరాజ్‌కు గాడ్‌ ఫాదర్‌

చంద్రబాబు చార్లెస్‌ శోభరాజ్‌కు గాడ్‌ ఫాదర్‌
చంద్రబాబును మించిన గజదొంగ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేడు. తెలుగుదేశం కాదు…తెలుగు దొంగల పార్టీ అది. కుట్రలు, అవినీతి, అక్రమార్జనతో చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్‌ను సర్వనాశనం చేశారు. తనపై వచ్చిన 18 అవినీతి కేసులను కొన్ని వ్యవస్థలను లోబరుచుకోవడం ద్వారా విచారణకు రాకుండా తప్పించగలిగారు.

కానీ ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయారు. చివరకు ఫోరెన్సిక్‌ పరీక్షలలో సైతం ఫోన్‌ సంభాషణలలోని ఆ గొంతు చంద్రబాబుదే అని నిర్ధారించినా తెలంగాణ పెద్దల కాళ్ళకు సాష్టాంగపడి మూటా ముల్లె సర్దుకుని హైదరాబాద్‌ నుంచి బిచాణా ఎత్తేశారు. అలాంటి చంద్రబాబు నా గురించి మాట్లాడేది.

మారిషస్‌ బ్యాంక్‌ను మోసం చేసి వందల కోట్లు కొల్లగొట్టిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రెండేళ్ళు జైలు శిక్ష పడినా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న చింతమనేని ప్రభాకర్‌, ఏలూరులో పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్న ఒక ఎంపీ, బెంగుళూరులో పేకాట డెన్‌లు నిర్వహిస్తున్న ఒక మంత్రి…

ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు వెనుక ఆ పార్టీకి చెందిన అనేక మంది అక్రమ దందాలలో ఆరితేరిన వారే. ఇంత ఘన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు నన్ను విజయ్‌ మాల్యాతో పోలుస్తారా?