ఏపీకి ఇచ్చిన హామీల ఊసే లేకుండా రాష్ట్రపతి ప్రసంగం

ఏపీకి ఇచ్చిన హామీల ఊసే లేకుండా రాష్ట్రపతి ప్రసంగం

ఏపీకి ఇచ్చిన హామీల ఊసే లేకుండా రాష్ట్రపతి ప్రసంగం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ నాటి ప్రధాన మంత్రి చేసిన ప్రకటనల అమలులో ఏమైపోయాయంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది.

విభజన కారణంగా వేల కోట్ల టర్నోవర్‌ కలిగిన ఐటీ పరిశ్రమ, దిగ్గజాల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి అనుబంధ పరిశ్రమలు, సినీ పరిశ్రమలు తెలంగాణలో మిగిలిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువస్తూ ఈ నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్‌ పొరుగు రాష్ట్రంతో సమంగా ఎదిగి పోటీ పడాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం వినా వేరే ఏ ప్యాకేజీలు పనికి రావని స్పష్టం చేయడం జరిగింది.

అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌, విశాఖలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌, కడపలో నిర్మిస్తామన్న సమీకృత ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నంలో నిర్మిస్తామని చెప్పిన ఓడ రేవు….రాష్ట్ర దిశదశలను మార్చే ఈ హామీలలో ఏ ఒక్కటీ రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకం పోవడం అత్యంత దురదృష్టకరం.