ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధమే: వైకాపా

ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధమే: వైకాపా

ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధమే: వైకాపా

శ్రీకాకుళం: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టంచేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్‌ బూత్‌ స్థాయి సమీక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంతో కలిసి ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన విధానాలతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రజలు నిరుత్సాహానికి గురై ఉన్నారని, గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సుమారు 600 పైచీలుకు హామీల్లో ఒక్కదాన్నీ నెరవేర్చని ఆయనకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలనే దృఢ సంకల్పంతో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. తమ పార్టీని బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు.


Recommended Posts