ఈరోజు లోక్ సభ సాక్షిగా టీడీపీ డబుల్ గేమ్, డ్రామాలు బయట పడ్డాయి.

ఈరోజు లోక్ సభ సాక్షిగా టీడీపీ డబుల్ గేమ్, డ్రామాలు బయట పడ్డాయి.

ఈరోజు లోక్ సభ సాక్షిగా టీడీపీ డబుల్ గేమ్, డ్రామాలు బయట పడ్డాయి. ఒక వైపు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినట్టే ఇచ్చి.. మరోవైపు ఆ నోటీసు చర్చకు రాకుండా.. సభ జరగకుండా మిగతా ఒకటి, రెండు పార్టీల ఎంపీలతో కలసి టీడీపీ ఎంపీలు స్పీకర్ వెల్ లోకి వెళ్ళి అడ్డుకున్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా వారి వారి స్థానాల్లో నే ఉన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ జరగాలని కోరుకుంటోంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ అడ్మిట్ కావాలని కోరుకుంటోంది. అడ్మిట్ అయ్యాక దానిపై చర్చ జరగాలని కోరుకుంటోంది. కానీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఆలోచించటం లేదు.

టీడీపీ ఎంపీలు, మిగతా సభ్యులతో కలసి స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి సభను అడ్డుకున్నారు. దీనినిబట్టి ప్రజలే అర్థం చేసుకోవచ్చు. ఎవరు అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలని కోరుకున్నారో.. ఎవరు రాకూడదని కోరుకుంటున్నారో…


Recommended Posts