‘ఆయన వైఎస్ఆర్ సీపీ నేత కాదు’

'ఆయన వైఎస్ఆర్ సీపీ నేత కాదు'

‘ఆయన వైఎస్ఆర్ సీపీ నేత కాదు’

'ఆయన వైఎస్ఆర్ సీపీ నేత కాదు'

సాక్షి, అమరావతి:
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ జనరల్ సెక్రెటరీ, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘గంగుల ప్రతాపరెడ్డి ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి’ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరినట్టు కొన్ని చానళ్లు, పత్రికల ద్వారా జరిగిన ప్రచారాన్ని ఖండిస్తున్నాం.

గంగుల ప్రతాపరెడ్డి వైఎస్ఆర్‌సీపీలో చేరనూ లేదు. మా సభ్యుడు కాదు. మా పార్టీకి సంబంధించిన నాయకుడూ కాదు. కాబట్టి ఆయన మా పార్టీని వీడటం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెయాల్సిందిగా మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు’ విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు వైఎస్ఆర్ సీపీ నేత గంగుల ప్రతాపరెడ్డి అధికార టీడీపీలో చేరారని కథనాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే.


Recommended Posts