ఆంధ్ర ప్రదేశ్‌లో రేషన్ షాపులను మాల్స్‌ పేరిట రిలయెన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్‌ వంటి సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు?

ఆంధ్ర ప్రదేశ్‌లో రేషన్ షాపులను మాల్స్‌ పేరిట రిలయెన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్‌ వంటి సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు?

ఆంధ్ర ప్రదేశ్‌లో రేషన్ షాపులను మాల్స్‌ పేరిట రిలయెన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్‌ వంటి సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు? ఈ విధానం ఎవరిని ప్రోత్సహించడానికి? రాష్ట్రంలోని మొత్తం 24 వేల రేషన్‌ షాపుల్లో ఇప్పటికి 6 వేల షాపులను మాల్స్‌ పేరుతో  ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందా? అంటూ శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ చౌదరి జవాబిస్తూ అర్హులకు సకాలంలో రేషన్‌ అందడమే ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం కనుక రేషన్‌ సరుకులను ఎలా పంపిణీ చేయాలి లేదా ఎవరి ద్వారా పంపిణీ చేయాలన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టప్రకారమే జరుగుతుందని తెలిపారు.