లాకమిషన్‌ సమావేశానికి విజయసాయిరెడ్డి

లాకమిషన్‌ సమావేశానికి విజయసాయిరెడ్డి

లాకమిషన్‌ సమావేశానికి విజయసాయిరెడ్డి

Vijaysai reddy for the Law Commission meeting - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయ లా కమిషన్‌ సమావేశానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ముగ్గురు ప్రతినిధులతో కూడిన బృందం హాజరవనుంది.

లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి లా కమిషన్‌ చేస్తున్న సంప్రదింపుల్లో భాగంగా వైఎస్సార్‌సీపీకి ఆహ్వానం అందింది. ఆ మేరకు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం మంగళవారం హాజరై తమ పార్టీ అభిప్రాయాలను లా కమిషన్‌కు తెలియజేస్తుంది.


Recommended Posts