Press meet at Party Central Office, Tadepalli

Press meet at Party Central Office, Tadepalli

Press meet at Party Central Office, Tadepalli
ఆదాన్ కంపెనీ మా కుటుంబానికి చెందిందంటూ చంద్రబాబు, టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇతర కంపెనీల్లో కామన్ డైరెక్టర్లుగా ఉన్నంత మాత్రాన ఆ కంపెనీలు మా కుటుంబానికి చెందినవిగా దుష్ప్రచారం చేయడం తగదు.


నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ నాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు మేమూ చేయగలం.

నేను ఈరోజు వరకూ చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఏనాడూ మాట్లాడలేదు. కానీ మీరు పరిధి దాటి ప్రవర్తిస్తే మేము కూడా మీకు పదింతలు చేయాల్సి వస్తుంది.

ఏదో క్రూయిజ్ కంపెనీ నా కుమార్తెదంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ కంపెనీ నిజంగా మాదే అయితే దాన్ని చంద్రబాబుకే ఫ్రీగా రాసిస్తాం. చంద్రబాబు ఎంత పచ్చి అబద్దాలకోరు అన్నది దీన్నిబట్టే అర్థమవుతుంది.

చంద్రబాబు హయాంలో 20 మద్యం డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చాడు. 254 కొత్త బ్రాండులకు అనుమతులు ఇచ్చాడు. మద్యంలో ఆరితేరిందెవరు.. చంద్రబాబా.. మేమా?