సుప్రీం కోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం మరింత పారదర్శకంగాను…

సుప్రీం కోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం మరింత పారదర్శకంగాను, పటిష్టంగాను జరిగేందుకు వీలుగా రాజ్యాంగంలో ఆర్టికల్ 366ను సవరించాలని ప్రతిపాదిస్తూ రాజ్య సభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై శుక్రవారం జరిగిన చర్చలో పాల్గొని ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది…
ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం మరింత పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ తర్వాత కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా ఉదహరించడం జరిగింది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సబర్వాల్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడాలి. ఎన్జేసీ బిల్లును అన్ని రాష్ట్రాలు ఆమోదించినా.. సుప్రీం తిరస్కరించటానికి కారణం ప్రాథమికంగా బిల్లు అస్తవ్యవస్థంగా ఉండటమే.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 సవరణ ద్వారా న్యాయవ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉన్నందున ఈ బిల్లుకు నా పూర్తి మద్దతును ప్రకటించాను. కొలీజియం వ్యవస్థ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా.
Recommended Posts

During the discussion on the interim budget…
07/02/2024