ఓటు వేసే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకూ, ప్రజలకూ మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఓటు వేసే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకూ, ప్రజలకూ మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రేయ రియల్ ఎస్టేట్స్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతిలో కలిసి నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె నేహా రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి నిధులు తేవడానికి పార్లమెంట్ లో నేను చేసిన ప్రయత్నాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు నేను చేసిన పోరాటం, నా అనుభవం దృష్టిలో పెట్టుకొని నెల్లూరు అభివృద్ధికి ఒక విజన్ తో ముందుకెళ్తున్న నన్ను ఎంపీగా ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని సభలో నా కుమార్తె కోరారు. నా కుటుంబ సభ్యులను ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన శ్రేయ రియల్ ఎస్టేట్స్ అసోసియేట్స్ కు, హాజరైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు.