నెల్లూరు సిటీ అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ఈరోజు..
నెల్లూరు సిటీ అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ఈరోజు నగరంలోని 7వ డివిజన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. విద్యార్దుల కోసం మేం అమలు చేస్తున్న వినూత్న పథకాల ద్వారా వారి భవితకు బంగారు బాటలు పడేలా పాలన సాగిస్తుంటే ఫీజుల పేరుతో విద్యను వ్యాపారంగా మార్చి కోట్లకు పడగలెత్తిన నారాయణ లాంటి స్వార్థపరులైన వ్యాపారులకు టీడీపీ టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. జగన్ గారి పాలనలో బడుగు బలహీనవర్గాల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే మా ధ్యేయం. దళారులను తరిమి కొట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నా.