నెల్లూరు సిటీ, 45వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి ముదిరెడ్డి వేదవతి, డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, పలువురు పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు సిటీ, 45వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి ముదిరెడ్డి వేదవతి, డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, పలువురు పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరు బస్ స్టాండ్ పరిసర ప్రాంతంలోని చిరువ్యాపారులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అలాగే ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమం, అభివృద్ధి కొనసాగేందుకు వైఎస్సార్సీపీని ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. నెల్లూరు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టో ప్రతులను ప్రజలకు అందిస్తూ అందులోని అంశాలను వివరించారు. ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ ఖలీల్ అహ్మద్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని, అలాగే శ్రీ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. ప్రచారంలో నా కుటుంబసభ్యులకు తోడుగా నిలిచిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి వేదవతి, పార్టీ డివిజన్ ఇన్చార్జ్ శ్రీ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.