నెల్లూరు పార్లమెంటు స్థానంతోపాటు, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది.
నెల్లూరు పార్లమెంటు స్థానంతోపాటు, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. పేదలు, బడుగు బలహిన వర్గాలు, మహిళలు, గ్రామీణులు మన పార్టీకి ఓట్లు వేశారు. రామ్మూర్తి నగర్ లోని నా క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఎన్నికల ఏజెంట్లతో కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన తీరుపై జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాది శ్రీ మలిరెడ్డి శ్రీనివాసులుతో కలిసి సమావేశం నిర్వహించాను. కౌంటింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలని వారికి దిశా నిర్దేశం చేయడం జరిగింది.