నెల్లూరులోని మద్రాసు బస్టాండ్ వద్ద ఉన్న కాయగూరల మార్కెట్ లో ఈరోజు..
నెల్లూరులోని మద్రాసు బస్టాండ్ వద్ద ఉన్న కాయగూరల మార్కెట్ లో ఈరోజు నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీ ఖలీల్ అహ్మద్, పార్టీ నాయకులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శ్రీమతి స్రవంతి, శ్రీ ఆనం జయకుమార్ రెడ్డి తదితరులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం. స్థానిక వ్యాపారులు, కొనుగోలుదారులు, కార్మికులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం. ఈ సందర్భంగా వారి నుంచి విశేష స్పందన లభించింది. మార్కెట్ లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు కల్పించి ఉన్నత ప్రమాణాలతో మార్కెట్ ను ఆధునీకరిస్తాం.