కోవూరు నియోజకవర్గం, విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో ఈ రోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి..
కోవూరు నియోజకవర్గం, విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో ఈ రోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి స్థానిక హరిణి సొసైటీ (పీఏసీఎస్) చైర్మన్ శ్రీ పెనుబోతు ప్రసాద్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ శ్రీ అంకబాబు, మండల పార్టీ కన్వీనర్ శ్రీ కాటంరెడ్డి నవీన్ రెడ్డి తదితర పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగేందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు అభివృద్ధికి రూపొందించిన ప్రత్యేక మేనిఫెస్టో ప్రతులు ఇంటింటికి అందిస్తూ, అందులోని అంశాలను వివరించారు. ప్రచారంలో నా సతీమణికి తోడుగా నిలిచిన
హరిణి సొసైటీ చైర్మన్ శ్రీ పెనుబోతు ప్రసాద్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ శ్రీ అంకబాబు, మండలపార్టీ కన్వీనర్ శ్రీ కాటంరెడ్డి నవీన్ రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.