కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, చింతోపు, కొత్తూరు చింతోపు గ్రామాల్లో ఈరోజు..
కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, చింతోపు, కొత్తూరు చింతోపు గ్రామాల్లో ఈరోజు చింతోపు గ్రామ సర్పంచ్ శ్రీమతి పెరుమారెడ్డి అరుణ, ఉపసర్పంచ్ శ్రీ పెరుమారెడ్డి విజయ రాఘవరెడ్డి, పార్టీ నేతలతో కలిసి నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, సంక్షేమ పాలన కొనసాగుతుందని ప్రజలకు ఆమె ప్రజలకు భరోసా కల్పించారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే ఈవీఎం బ్యాలెట్ లో శ్రీ ప్రసన్నకుమార్ రెడ్డి క్రమ సంఖ్య ౩, ఎంపీ ఈవీఎం బ్యాలెట్ లో నా క్రమ సంఖ్య 4పై ప్రజల్లో అవగాహన కల్పించారు.