పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది కాబోలు!

పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది కాబోలు!

పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది కాబోలు!
——————————————————–
చంద్రబాబు నాయుడుకు మతిభ్రమించింది. డౌటే లేదు. ఇది ముమ్మాటికీ నిజం. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌ను పట్టుకుని ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా అంటున్నారు. పైగా అమెరికన్‌ ప్రజలంతా ఏకమై తమ రాజ్యాంగాన్ని సవరించుకుని రూజ్‌వెల్ట్‌ను నాలుగుసార్లు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని సెలవిచ్చారు. రూజ్‌వెల్ట్‌ 1933 నుంచి 1945 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాతే అధ్యక్ష పదవికి రెండు దఫాలకు మించి పోటీ చేయడానికి వీల్లేదంటూ 1947లో రాజ్యాంగ సవరణను అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదించింది. 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చింది. ఇదీ చరిత్ర.

అయ్యా! చంద్రబాబు గారు! ఏమాత్రం తడుముకోకుండా, కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పడంలో మాత్రమే మీకు ప్రావీణ్యం ఉందని అనుకున్నాం. చరిత్రను కూడా ఇంత దారుణంగా వక్రీకరించేంతగా బరితెగిస్తున్నారంటే అది కచ్చితంగా మానసిక జబ్బు మాత్రమేనని నిర్ధారణ అవుతోంది. మీ మతిమరుపు వ్యాధికి తక్షణమే చికిత్స తీసుకోకపోతే… చరిత్ర మొత్తం మీ చేతుల్లో ఖూనీ అయిపోతుందేమోనని ఆందోళనగా ఉంది. మీరేమో చరిత్రకు… మీ పుత్రరత్నం (పప్పు) తెలుగు భాషకు శాశ్వతంగా గ్రహణం పట్టించడానికి కంకణం కట్టుకున్నట్లుంది!


Recommended Posts