28న జగనన్నతో నడుద్దాం

28న జగనన్నతో నడుద్దాం

28న జగనన్నతో నడుద్దాం

vijaya sai reddy call to people for walk with jagan - Sakshi

ప్రజాసంకల్పాన్ని ఘనంగా చాటుదాం

ప్రజా సమస్యలపై శతసహస్ర గొంతుకలై నిలదీద్దాం

పార్టీ కో ఆర్డినేటర్లకు ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపు

నెలాఖరులోగా అన్ని కమిటీల నియామకం

వచ్చే నెలాఖరుకల్లా బూత్‌ కమిటీలు నియామకం

సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటుతున్న సందర్భంగా తలపెట్టిన ‘జగనన్నతో నడుద్దాం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకొని కోస్తాలో అడుగుపెట్టిన వై.ఎస్‌.జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో తాము పడుతున్న కష్టాలను చెప్పుకుంటున్నారని చెప్పారు. దారిపొడవునా వేలాది మందిని కలుస్తూ వారి కష్టసుఖాలు వింటూ వైఎస్‌ జగన్‌  అప్రతిహాతంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు.

మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ కో ఆర్డినేటర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఈ నెల 28న నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాట బోతుందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టామన్నారు. జిల్లాలో కూడా ఇదేరీతిలో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు, అభిమానులు, సామాన్య ప్రజలతో కలిసి పాదయాత్రలు చేయాలన్నారు. పార్టీ కో ఆర్డినేటర్లతో పాటు అనుబంధ కమిటీలు, ఇతర విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మండల నేతలంతా పాదయాత్రలో పాల్గొనేలా చూసుకోవాలన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సమన్వయం చేయాలన్నారు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో వైఎస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు.

నెలఖారులోగా కమిటీల నియామకం పూర్తి చేయాలి
పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో వార్డు, మండల కమిటీల నియామకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కో ఆర్డినేటర్లను ఆదేశించారు. వార్డు, మండల కన్వీనర్లతో పాటు అనుబంధ విభాగాలకు కూడా అధ్య క్షులు, ఇతర కార్యవర్గాల నియామకాలను నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాను మూడు పార్లమెంటు జిల్లాలుగా వేరు చేసినందున వాటి పరిధిలో కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలన్నారు. అదే విధంగా ప్రతి బూత్‌కు పదిమంది చొప్పున కమిటీల ఏర్పాటును ఫిబ్రవరి నెలాఖరులోగా నియమించాలని సూచించారు. బూత్‌ కమిటీల్లో ఖాళీగా ఉన్న నియామకాలను భర్తీ చేయాలన్నారు. సైనికుల్లా పనిచేసే వార్ని గుర్తించి బూత్‌ కమిటీల్లో వేయాలన్నారు.

సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ కమిటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఐటీ విభాగం రాష్ట్రకన్వీనర్‌ చల్లా మధుసూదన రెడ్డి, విశాఖ, అనకాపల్లి, అరుకు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్‌నాధ్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, అనకాపల్లి పార్లమెంటు కో ఆర్డినేటర్‌ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పలనాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజు, అక్కరమాని విజయనిర్మల, సనపల చంద్రమౌళి, పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి, చెట్టి ఫల్గుణ, బొడ్డేడ ప్రసాద్, ఏకేవి జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పాడేరు నుంచి భారీగా చేరికలు
సాక్షి, విశాఖపట్నం :వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉజ్వల భవిష్యత్‌ ఉందని.. ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరకు అసెంబ్లీ కో ఆర్డినేటర్‌ చెట్టి పాల్గుణల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సీనియర్‌ నేతలు మంగళవారం పార్టీలో చేరారు. విశాఖలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల నుంచి సుమారు వందమంది చేరగా.. వారందరికీ ఎంపీ విజయసాయిరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మహానేత సంక్షేమ ఫలాల ద్వారా లబ్ధి పొందిన గిరిజనులు దివంగత వైఎస్సార్‌ను తమ గుండెల్లో పెట్టుకుని దైవంలా కొలుచుకుంటున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీకి చెందిన ఎంపీటీసీల ఫోరం చింతపల్లి అధ్యక్షుడు ఉల్లి సత్యనారాయణ, సర్పంచ్‌ల ఫోరం చింతపల్లి మండల అధ్యక్షుడు బోయిన సత్యనారాయణ, పీసా కమికీ చింతపల్లి మండల అధ్యక్షుడు ఉల్లి నూకరాజు, బీజేపీ చింతపల్లి డివిజన్‌ నాయకులు వసుపరి ప్రసాద్, బీఎస్పీ డివిజన్‌ అధ్యక్షుడు సుమర్ల సూరిబాబు, జల్లిబాబు, పీసా కమిటీ సభ్యులు బురిటి ఆదినారాయణ, పొటుకూరి ధారబాబు, అరుకు చిన్నయ్య, ఉల్లి సతీష్, సెగ్గె నూకరాజు, కాంగ్రెస్‌ యూత్‌ నాయకులు మాజీ ఎంటీపీసీ సభ్యుడు బురిటి ధనుంజయ, ఉన్నారు.


Recommended Posts