కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌తో భేటీ…అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో పర్యావరణ కాలుష్యంపై ఫిర్యాదు.

కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌తో భేటీ…అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో పర్యావరణ కాలుష్యంపై ఫిర్యాదు.
—————————————————————————————————————
న్యూఢిల్లీ, జనవరి4: విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో నెలకొన్న స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్ఈజెడ్)లో దాదాపు 40 కంపెనీలు పర్యావరణ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ కాలుష్యం సృష్టిస్తున్నాయంటూ గురువారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌ను విశాఖ జిల్లా నాయకుల బృందంతో స్వయంగా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఎస్ఈజెడ్లో దాదాపు 40 కంపెనీలు పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టవలసిన మురుగు నీటిని శుద్ధి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయనందున అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని అనేక గ్రామాల్లో తాగు నీరు కలుషితంగా మారిపోయిందని, కాలుష్య జలాలను ఆయా కంపెనీలు నేరుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నందున సముద్ర జలాలు కూడా కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఎస్ఈజెడ్లోని కంపెనీల కారణంగా భూగర్భ జలాలు, సముద్ర జలాలు కూడా కలుషితమైపోతూ రైతులు, మత్స్యకారులకు ఎనలేని నష్టాన్ని కలిగిస్తున్నాయని, ఈ సమస్యపై ఎస్ఈజెడ్ పరిసర బాధిత గ్రామాల ప్రజలు అనేకమార్లు ఆందోళనలు చేపట్టారు. తమ గోడు పట్టించుకోవాలంటూ వారు పలుమార్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు మొత్తుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి తక్షణమే దీనిపై స్పందించి ఎస్ఈజెడ్లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని బాధిత గ్రామాల ప్రజలను జల కాలుష్యం బారి నుంచి కాపాడాలని మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
Recommended Posts
Casino Online Que Acepta Mastercard
26/06/2025
Paypal Casino Utan Svensk Licens
20/12/2024
CASINO MUNKEBJERG
28/10/2024