డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.
విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం రాజ్యసభ జీరో అవర్ లో సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. మినీ రత్న కంపెనీగా ప్రసిద్ధి చెంది లాభాల బాట పట్టిన సంస్థలో ప్రభఉత్వం పెట్టుబడుల ఉపసంహరణ కేవలం ప్రైవేటు కంపెనీలకు మేలు చేసినట్లు మాత్రమే అవుతుంది. డీసీఐ దేశంలోని మేజర్ పోర్టుల్లోనే గాక విదేశాల్లోనూ అసమాన సేవలు అందిస్తూ అద్భుతంగా పనిచేస్తోంది. ప్రైవేటీకరణ వల్ల దేశసమగ్రతకు, రక్షణకు భంగం ఏర్పడే అవకాశముంది.
పైగా ప్రభుత్వం నిర్ణయం వలన 1500 మంది పైగా డీసీఐ ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. డీసీఐ ద్వారా పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు అతి కొద్ది ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే దక్కాయి. అలాంటి వాటిలో డీసీఐ ఒకటి. దీనిని కూడా ప్రైవేట్ కు అప్పగించడం వలన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత వెనక్కి నెట్టినట్లు అవుతుంది. ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని ప్రైవేటీకరణ ఆలోచనకు స్వస్తి చెప్పాల్సిందిగా కోరుతున్నా…
Recommended Posts
Familie Akkoç Baat Café Casino Uit
20/03/2025
Mobile Casino Pay By Phone Bill Uk
24/01/2025